ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలోని డీజే శబ్దాలకు తన ఫారమ్‌లోని కోడి పిల్లలు మృతి (chicken died from high sound) చెందాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
'బాలేశ్వర్ జిల్లాలో కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నాను. పొరుగు ఇంట్లో వివాహ వేడుక జరుగుతోంది. పెళ్లిలో పెద్ద శబ్దంతో డీజేలో పాటలను పెట్టారు. ఆ శబ్దాలు విన్న కోడి పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. రెక్కలు ఆడిస్తూ.. అక్కడే ప్రాణాలు విడిచాయి' అని బాధితుడు రంజిత్ పరీదా తెలిపారు. డీజే శబ్దాలు ఆపేయాలని ప్రాధేయపడినా నిందితులు ఏ మాత్రం వినలేదని చెప్పారు. ఫలితంగా 60 కోడి పిల్లలు మృతి చెందాయని, అందుకే నీలగిరి స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు రంజిత్.