తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Farm Laws repealed: మళ్లీ తెరపైకి సాగు చట్టాలు- కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు - సాగు చట్టాలు

Farm Laws repealed: సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల ఉద్యమంతో రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురానున్నామనే సంకేతాలను ఇచ్చారు.

Farm Laws repealed
వ్యవసాయ చట్టాలు

By

Published : Dec 25, 2021, 3:41 PM IST

Farm Laws repealed: అన్నదాతల సుదీర్ఘ ఉద్యమానికి దిగొచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని మళ్లీ తీసుకురానుందా? కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలతో అవుననే అనిపిస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తోమర్‌.. మూడు సాగు చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Farm Laws News: నాగ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరికి(విపక్షాలను ఉద్దేశిస్తూ) ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని అన్నారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించడం గమనార్హం.

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాదికి పైగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం చట్టాలపై వెనక్కి తగ్గింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దుకు సంబంధించి బిల్లును తీసుకురాగా.. ఉభయసభలు ఆమోదించాయి.

ఇదీ చదవండి:ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!

రాజకీయాల కోసమే.. 'భజ్జీ' క్రికెట్‌కు వీడ్కోలు పలికారా?

ABOUT THE AUTHOR

...view details