తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్లాక్​ ఇడ్లీ.. ఆ టిఫిన్​ సెంటర్ స్పెషాలిటీ.. టేస్ట్​ చేసేందుకు జనం క్యూ!

Black Idli Nagpur: దక్షిణ భారత దేశంలో ఫేమస్ అల్పాహారం ఇడ్లీ. ఇడ్లీలను సులభంగా చేసుకోవచ్చు. తింటే తేలికగా జీర్ణం అవుతాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టపడుతుంటారు. అయితే.. ఇడ్లీలు అనగానే తెలుపు రంగులోనే ఉంటాయి కదా? మరి నలుపు రంగులో ఉండే ఇడ్లీలను ఎప్పుడైనా చూశారా?

Black Idli in Nagpur
బ్లాక్ ఇడ్లీలు

By

Published : Dec 20, 2021, 3:51 PM IST

Updated : Dec 20, 2021, 6:41 PM IST

ఆ టిఫిన్​ సెంటర్​లో బ్లాక్ ఇడ్లీ

Black Idli Nagpur: మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సివిల్‌ లైన్ ఏరియా.. అక్కడో చిన్న టిఫిన్ సెంటర్.. టిఫిన్‌ సెంటర్ వద్ద బారులు తీరిన జనం.. ఉదయాన్నే ఎక్కడైనా మాములుగా కనిపించే దృశ్యమే. కానీ వచ్చిన వారు నాగ్​పుర్​ వాసులు మాత్రమే కాదు.. వారిలో సమీపంలోని వేరే ప్రాంతాల నుంచి సైతం టిఫిన్ కోసం వచ్చినవారు కూడా ఉన్నారు. ఆ టిఫిన్ సెంటర్ అంతలా ప్రజలను ఆకర్షించడానికి కారణం ఏమనుకుంటున్నారా ? అదే బ్లాక్ ఇడ్లీ.

వేడివేడిగా బ్లాక్ ఇడ్లీ

Charcoal idli: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుమార్‌ రెడ్డి కుటుంబం.. చాలాఏళ్ల క్రితమే నాగ్‌పుర్‌లో స్థిరపడింది. నాగ్‌పుర్‌లోని సివిల్ లైన్ ఏరియాలో టిఫిన్ సెంటర్ ప్రారంభించిన కుమార్‌ రెడ్డి.. దక్షిణ భారత వంటకాలను చేయడంలో దిట్ట. ఇడ్లీ తయారీలో ఆయనది అందెవేసిన చేయి. కారంపొడి ఇడ్లీ, కార్న్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, చీజ్ ఇడ్లీ, చాక్లెట్ ఇడ్లీ, పిజా ఇడ్లీ, ఇడ్లీ ఫ్రై.. ఇలా ఒక్కటా రెండా.. దాదాపు 40 రకాల ఇడ్లీలను తయారుచేస్తున్నాడు కుమార్ రెడ్డి. అయితే ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతున్నాయని ఇంకేదైనా కొత్తగా చేయాలని మిత్రులు సూచించారు. అప్పుడు వచ్చిందే బ్లాక్ ఇడ్లీ ఆలోచన.

బ్లాక్ ఇడ్లీలు తయారు చేస్తున్న కుమార్ రెడ్డి
బ్లాక్ ఇడ్లీలను గిన్నెలో నుంచి బయటకు తీస్తూ..
బ్లాక్ ఇడ్లీలను ఆరగిస్తున్న యువత

ఇదీ చూడండి:3 నిమిషాల్లో 19 ఇడ్లీలు తిని.. విజేతలుగా నిలిచి..​

Black idli recipe: నల్లటి ఇడ్లీ తయారీలో కొబ్బరి చిప్పలు, నారింజ తొక్కలు, బీట్ రూట్ గుజ్జు వంటి సహజ పదార్థాలనే వినియోగిస్తామని.. అందుకే ఏ సమస్యలూ రావని కుమార్‌ రెడ్డి చెబుతున్నారు. వీటి వల్ల ఇడ్లీ రుచి కూడా అదిరిపోతుందంటున్నారు.

బ్లాక్ ఇడ్లీలను వడ్డిస్తున్న కుమార్ రెడ్డి

"వివిధ రకాల రంగుల్లో, పలు రకాల ఇడ్లీలు చేస్తున్నప్పుడు నల్లటిరంగులో ఇడ్లీలు తయారు చేయవచ్చు కదా అని.. కొంతమంది స్నేహితులు అడిగారు. అప్పుడే తయారు చేయాలని నిర్ణయించుకున్నా. దీనికి కావాల్సింది కొబ్బరి చిప్పలు, నారింజ పండ్ల తొక్కలు. వీటిని బాగా ఎండబెట్టాలి. తర్వాత బీట్ రూట్ గుజ్జును కలిపి బాగా రోస్ట్ చేయాలి. మొదట్లో వీటిని తినడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత వీటిపై నమ్మకం కుదిరి ఒకసారి తినగానే.. ఇష్టపడటం మొదలెట్టారు."

-కుమార్ రెడ్డి, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు

Variety idli: ఈ బ్లాక్‌ ఇడ్లీని రుచిచూడటానికి నాగ్‌పుర్‌తో పాటు సమీప ప్రాంతాల వారు వస్తున్నారు. నల్లటి ఇడ్లీనే కాకుండా.. మరిన్ని వెరైటీలు చేయాలని కస్టమర్లు కోరుతున్నారని కుమార్ రెడ్డి చెబుతున్నారు. అన్ని రంగులతో కలిపి సప్తరంగి పేరిట ఇడ్లీ చేయాలని సూచిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే దానిని తయారు చేస్తానని అంటున్నారు.

నాగ్​పుర్​లో టేస్టీ బ్లాక్ ఇడ్లీలు
ప్లేట్​లో బ్లాక్ ఇడ్లీ

ఇవీ చూడండి:

వానరం ప్రేమ.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతూ...

Elephant Attack Video: అతడ్ని వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు!

ఆదివాసీ మహిళపై అమానుషం.. మీద నీళ్లు పోసి..

Last Updated : Dec 20, 2021, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details