తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ.. - మధ్యప్రదేశ్ వార్తలు

ఏడాదిన్నర క్రితం మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టకుండా ఇంట్లోనే ఉంచుకుంది అతడి కుటుంబం. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

family was living with the dead body for many days in kanpur
family was living with the dead body for many days in kanpur

By

Published : Sep 23, 2022, 9:45 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఏడాదిన్నర క్రితం మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి.. అంత్యక్రియలు చేపట్టకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక ఎల్​ఎల్​ఆర్​ ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..

పోలీసుల వివరాల ప్రకారం..
రావత్​పుర్​లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్​(38) అనే వ్యక్తి .. అహ్మదాబాద్​లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. 2021 ఏప్రిల్​ 22న అతడు మరణించాడు. అయితే విమలేశ్​ మృతి చెందినా.. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. అయితే విమలేశ్​ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్​ బ్యాంక్​లో మేనేజర్​గా పనిచేస్తుంది. పెన్షన్​ దరఖాస్తు చేయడానికి విమలేశ్​ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే విమలేశ్​ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో ఎల్​ఎల్​ఆర్​ ఆస్పత్రికి తరలించారు. అయితే విమలేశ్​ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని తెలిపారు. అయితే ఏడాదిన్నరగా మృతదేహాన్ని ఎలా ఇంట్లో ఉంచుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:పాపం గజరాజు.. కరెంట్​ షాక్​కు గురై అక్కడిక్కడే..

స్కూల్​ టాయిలెట్​ క్లీన్​ చేసిన భాజపా ఎంపీ.. ఖాళీ చేతులతోనే..

ABOUT THE AUTHOR

...view details