Brain dead youth organ donation: తమ కుమారుడు ఇక బతకడని తెలిసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది ఆ కుటుంబం. బ్రెయిన్ డెడ్ అయిన తమ బిడ్డ అవయవాలను దానం చేసింది. ఫలితంగా నలుగురికి పునర్జన్మనిచ్చింది. సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.
యువకుడి బ్రెయిన్ డెడ్.. అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ
Organ donation: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. ఫలితంగా నలుగురికి పునర్జన్మనిచ్చారు.
రాజస్థాన్ సీకర్‌కు చెందిన సునీల్ సాయి ఈనెల 16న కారులో ఇంటికి వస్తుండగా మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని మొదట ఎస్కే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడం వల్ల జైపుర్‌లోని సవాయి మాన్సింగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించారు. బతకడం కష్టమని తేల్చారు. దీంతో తమ కుమారుడి అవయవాలు దానం చేస్తే ఇతరులకు జీవం పోసినట్లవుతుందని భావించిన కుటుంబం.. అతడి అవయవాలు డోనేట్ చేసింది. దీంతో వైద్యులు సునీల్ రెండు కిడ్నీలను ఇతరులకు అమర్చారు. గుండెను గ్రీన్ కారిడార్ ద్వారా ఇటర్నల్ అస్పత్రికి తరలించి మరొకరికి పునర్జన్మనిచ్చారు. లివర్‌ను మనిపాల్ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి అమర్చారు. ఇలా నలుగురికి కొత్త జీవితాన్నిచ్చారు.
ఇదీ చదవండి:భార్యను కొట్టి, నోట్లో వస్త్రం కుక్కి సెక్స్- కోర్టు ఏం చేసిందంటే?