మధ్యప్రదేశ్లో 15 ఏళ్లుగా రోజుకు 8 గంటల పాటు ఓ మహిళను గొలుసుతో బంధిస్తున్న అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజూ కుటుంబసభ్యులు ఆ మహిళను గొలుసుతో ఇంటి గుమ్మం ముందు కట్టేసి తమ రోజువారీ పనులకు వెళ్తున్నారు. సాయంత్రం తిరిగి వచ్చాక గొలుసును తొలగిస్తున్నారు. ఈ ఘటన ఉజ్జయిని నగరం.. నగడా- పువాడియా ప్రాంతంలో జరిగింది.
అయితే ఆ మహిళ మతిస్తిమితం కోల్పోయిందని, గొలుసుతో కట్టకపోతే చుట్టూ ఉన్నవాళ్లకు ఇబ్బంది పెడుతుందని, అందుకే బంధిస్తున్నామని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
" మా అక్కకు 2006లో వివాహం జరిగింది. 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మతిస్తిమితం కోల్పోవడం వల్ల భర్త వదిలేశాడు. అప్పటి నుంచి ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నాం. పలు మార్లు చికిత్స చేయించినా..ఎటువంటి ఫలితం లేదు. అందుకే గొలుసుతో బంధించాల్సి వచ్చింది."