చిన్నారి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ తండ్రిని చూసి.. యూపీలోని బాగ్పత్ ప్రాంత ప్రజలందరూ చలించిపోయారు. తన రెండో భార్య చేసిన నిర్వాకంతో కుమార్తె కోల్పోయిన ఆ తండ్రి బాధను, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని అయ్యో అనుకున్నారు. అసలేం జరిగందంటే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాగ్‌పత్‌లోని యమునోత్రి హైవేపై శుక్రవారం.. రెండేళ్ల చిన్నారి ఏడ్చిందన్న కోపంతో ఆమె సవతి తల్లి రోడ్డుపై పడేసింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శనివారం కేసు విచారణ పూర్తయిన తరువాత చిన్నారి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.