తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వామీజీపై రేపిస్ట్ ముద్ర.. మర్మాంగం కట్.. ఐదేళ్ల తర్వాత భారీ ట్విస్ట్ - స్వామి గంగేశ్వరానంద రేప్​ కేసు

False rape case: స్వామీజీ అంగాన్ని కోసేసి, అత్యాచార యత్నం కేసు పెట్టిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన మహిళ అబద్ధపు కేసు పెట్టినట్లు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు ఆ మహిళపైనే కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు.

False rape case
స్వామి అంగం కోసిన కేసు కీలక మలుపు..!

By

Published : Feb 22, 2022, 6:37 PM IST

False rape case: కేరళ తిరువనంతపురంలో స్వామీజీ మర్మాంగాన్ని ఓ మహిళ కోసేసి, అత్యాచార యత్నం కేసు పెట్టిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన మహిళపైనే ఇప్పుడు కేసు నమోదు చేయాలని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు. తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ మహిళ ప్రియుడితో కలిసి డ్రామా ఆడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి గంగేశ్వరానందను కావాలని ఇరికించినట్లు గుర్తించారు.

ఇదీ జరిగింది...

స్వామి గంగేశ్వరానంద తన నివాసంలో లైంగిక వేధింపులకు ప్రయత్నించారని ఓ మహిళ ఆయనపై కేసు పెట్టింది. ఈ సమయంలోనే ఆత్మరక్షణ కోసం అతని పురుషాంగాన్ని కోసివేసినట్లు పోలీసులకు తెలిపింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్వామిపై 2017 మే 19న పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్వామిని విచారించగా తన అంగాన్ని తానే కోసుకున్నానని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత మాట మార్చారు. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కొంతకాలానికి ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి.. స్వామి తనపై అత్యాచారానికి యత్నించలేదని చెప్పింది. అతని సహాయకుడు అయ్యప్పదాస్ తన పై దాడి చేశాడని పేర్కొంది.

దీనిపై గంగేశ్వరానంద స్వామి హైకోర్టుని ఆశ్రయించారు. తనపై ఉన్న కేసును కొట్టేయాలని కోరారు. ఇందుకు మహిళ కూడా స్వామికి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చింది. అయితే దీనిపై స్వామీజీ డీజీపీని కలిసి ఈ కేసును క్రైం బ్రాంచ్​ పోలీసులకు అప్పగించాలని కోరారు.

వీడియోలు చూసి మరీ..

దర్యాప్తు చేపట్టిన కేరళ క్రైం బ్రాంచ్​ పోలీసులు.. స్వామీజీ శిష్యుడైన అయ్యప్పదాస్‌తో ఫిర్యాదు చేసిన మహిళ సన్నిహితంగా ఉండేదని కనుగొన్నారు. వీరి వివాహానికి స్వామి అంగీకరించరనే భయంతో ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు. వీరే స్వామిపై దాడి చేసి అత్యాచారం కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ కుట్రలో సదరు మహిళతో పాటు అయ్యప్పదాస్​కు భాగం ఉన్నట్లు గుర్తించారు. ఇలా స్వామిజీని ఇబ్బంది పెట్టేందుకు వారిద్దరూ కొల్లం, అలప్పుజలో కలిశారని పోలీసులు చెప్పుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా మహిళ ఫోన్​ను ఫోరెన్సిక్​కు పంపగా.. జననాంగాలను కత్తిరించే వీడియోల కోసం ఆమె వెతికినట్లు తేలిందని వెల్లడించారు.

ఇదీ చూడండి:

బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం- ఆరుగురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details