తెలంగాణ

telangana

ETV Bharat / bharat

False Cases Against Margadarsi Chitfunds: మార్గదర్శిపై బురద చల్లేందుకు పచ్చి అబద్ధాలతో ఏపీసీఐడీ కాకమ్మ కథలు - Yuri Reddy false complaint against on margadarsi

False Cases Against Margadarsi Chitfunds: ఆంధ్రప్రదేశ్​ సీఐడీ మార్గదర్శిపై బురద చల్లేందుకు మరో కట్టుకథతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఖాతాదారుల్ని భయపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రలేదు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తనకు అన్యాయం జరిగిందని యూరిరెడ్డి అనే వ్యక్తి మార్గదర్శిపై ఏపీసీఐడీకీ ఫిర్యాదు చేశారు. యూరిరెడ్డి ఇన్ని రోజుల తర్వాత ముందుకు రావటంపై ఏదో కుట్ర దాగుందనే భావన వ్యక్తం అవుతోంది.

False_Cases_Against_Margadarsi_Chitfunds
False_Cases_Against_Margadarsi_Chitfunds

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 7:26 AM IST

False Cases Against Margadarsi Chitfunds: మార్గదర్శిపై బురద చల్లేందుకు పచ్చి అబద్ధాలతో ఏపీసీఐడీ కాకమ్మ కథలు

False Cases Against Margadarsi Chitfunds:మార్గదర్శిపై మరో కట్టుకథ అల్లుతూ.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఇంకో కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన 5వేల రూపాయల పెట్టుబడికి.. 39.74 లక్షల డివిడెండ్‌ పొందిన యూరిరెడ్డి అనే వ్యక్తి.. ఆ షేర్లను సంస్థకే విక్రయించారు. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తన షేర్లను బలవంతంగా తీసుకున్నారని.. తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు వెనక మొత్తం ఏపీ సీఐడీయే సూత్రధారిగా కనిపిస్తోంది.

ప్రతిష్ఠను దెబ్బతీయడానికే: రామోజీ గ్రూప్‌ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా.. జగన్‌ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి.. ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది. యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి.. మార్గదర్శి సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌ల ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు.. ఏపీ సీఐడీతో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది.

AP CID Chief Pressmeet Ignoring Court Orders Against Margadarshi: కోర్టు ఉత్తర్వులను లెక్కచేయని ఏపీ సీఐడీ.. మార్గదర్శిపై మళ్లీ అదే దుష్ప్రచారం

హైదరాబాద్​ వ్యక్తి మంగళగిరిలో కేసు ఎందుకు: తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని నేరమూ అక్కడే జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయకుండా.. మంగళగిరికి వెళ్లి మరీ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడాన్ని బట్టే.. ఇది ఎంత పెద్ద కుట్రో, దాని వెనుక ఉన్నదెవరో అర్థమవుతోంది. ఆ ఫిర్యాదులో మార్గదర్శిపై యూరిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలే.

యూరిరెడ్డి నగదుగా మార్చుకున్నారు: జి.జె.రెడ్డి అనే వ్యక్తి 1962లో మార్గదర్శిలో పెట్టిన 5 వేల రూపాయల పెట్టుబడికి సంబంధించిన.. 90 షేర్లను ఆయన కుమారుల విజ్ఞప్తి మేరకు మార్గదర్శి సంస్థ వారిలో ఒకరి పేరు మీద బదిలీ చేసింది. వారికి చెందాల్సిన 39.74 లక్షల డివిడెండ్‌కు చెక్కు ఇచ్చింది. దాన్ని జి.జె.రెడ్డి కుమారుడు యూరిరెడ్డి వెంటనే నగదుగా మార్చుకున్నారు.

Margadarsi Case Updates 'మార్గదర్శి’లో సోదాలు ఆపండి'.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ

ట్రాప్‌ చేసి మార్గదర్శిపై తప్పుడు కేసు: యూరిరెడ్డి, ఆయన సోదరుడి విజ్ఞప్తి మేరకు వారి పేరు మీదున్న షేర్లను మార్గదర్శి సంస్థ ప్రమోటర్లు 2016లో కొన్నారు. ప్రతిఫలంగా వారికి 2.88 లక్షల చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కును యూరిరెడ్డి నగదుగా మార్చుకోలేదు. కొన్ని సందేహాలను లేవనెత్తుతూ.. లేఖ రాశారు. వాటన్నింటినీ నివృత్తి చేస్తూ కంపెనీ వెంటనే బదులిచ్చింది. ఏడేళ్లుగా మౌనంగా ఉన్న యూరిరెడ్డిని ఇప్పుడు సీఐడీ ట్రాప్‌ చేసి మార్గదర్శిపై తప్పుడు కేసు పెట్టించిందనే భావన వ్యక్తమవుతోంది.

2016లో జరిగిన షేర్ల బదిలీ ప్రక్రియ నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా జరిగింది. యూరిరెడ్డి సోదరులిద్దరూ.. తమ న్యాయవాదిని సంప్రదించి, అన్ని విషయాల్నీ ఆకళింపు చేసుకుని పూర్తి స్పృహతోనే షేర్ల విక్రయ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ షేర్లు కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తిని మన్నించినందుకు ఛైర్మన్‌ రామోజీరావుకు వారు ఈ-మెయిల్‌ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపారు.

MP Raghu Ramakrishna Raju lashed out at the YCP: సీఎం జగన్ నాయకత్వంలోనే... మార్గదర్శిపై దాడులు: రఘురామకృష్ణరాజు

తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు: యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 13న ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలకు, 2017లో ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు. గన్‌పాయింట్‌లో బెదిరించడంతో ట్రాన్స్‌ఫర్‌ డీడ్‌పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. షేర్ల ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన ఎస్‌హెచ్‌-4 పత్రంపై అది షేర్ల ట్రాన్స్‌మిషన్‌ పత్రంగా భావించి సంతకం చేశానని.. ఆయన ఇప్పుడు చెప్పడం పచ్చి అబద్ధం.

న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సంస్థ: 2016లో జరిగిన షేర్ల బదిలీపై ఫిర్యాదుదారుకు అసంతృప్తి, అభ్యంతరాలేవైనా ఉంటే చట్ట ప్రకారం పరిష్కరించుకోవడానికి హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ లేదా ఎన్‌సీఎల్‌టీని సంప్రదించేవారే తప్ప, ఏపీసీఐడీకి ఫిర్యాదు చేసేవారు కాదు. షేర్లు బదిలీ జరిగిన విషయాన్ని ఏడేళ్ల తర్వాత ఇప్పుడే గుర్తించినట్టుగా యూరిరెడ్డి ఫిర్యాదు చేయడమూ విడ్డూరంగానే ఉంది. మార్గదర్శి ప్రమోటర్లను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న యూరిరెడ్డి, ఆయనను ఆడిస్తున్న ఏపీ సీఐడీపైనా న్యాయపరమైన చర్యలకు సంస్థ సిద్ధమవుతోంది.

AP CID Chief Sanjay on Margadarsi: మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని మేమే చెబుతున్నాం: సీఐడీ చీఫ్ సంజయ్

ABOUT THE AUTHOR

...view details