Fake Universities Declared By UGC:చట్ట విరుద్దంగా నడుస్తున్న 21 విశ్వవిద్యాలయాలను నకిలీ సంస్థలుగా ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఉన్నత విద్యకోసం ఈ విశ్వవిద్యాలయాల్లో చేరవద్దని విద్యార్ధులను హెచ్చరించింది కమిషన్. సుమారు 21 స్వీయ-శైలి విశ్వవిద్యాలయాలను గుర్తింపు లేని నకిలీ సంస్థలుగా ప్రకటిస్తూ పబ్లిక్ నోటీసులు జారీ చేసింది.
ఈ విశ్వవిద్యాలయాలకు ఎటువంటి డిగ్రీ ప్రదానం చేసే అధికారం లేదని నోటీసులో స్పష్టంగా తెలిపింది. ప్రకటించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో అధిక సంస్థలు ఢిల్లీలోనే ఉన్నాయి. దాదాపు 8 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది. తర్వాత స్థానంలో ఉత్తర ప్రదేశ్ ఉంది. ఇక్కడ 7 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు నుంచి కార్యకాలపాలు నిర్వహిస్తున్న 'క్రీస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ'ని నకిలీ విశ్వవిద్యాయంగా ప్రకటించింది యూజీసీ. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్ఛేరిల్లో ఒక్కో విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో రెండు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది.