FAKE SWAMIJI SEXUAL HARASSMENT: సమస్యలు తీరుస్తానని చెప్పి యువతిని నమ్మించాడో దొంగ స్వామీజీ. అమెలోని భక్తిని ఆసరాగా చేసుకుని తన ఇంటికి రమ్మన్నాడు. అనంతరం మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడు. దీనికి స్వామీజీ భార్యా కూడా సహకరించింది. దీంతో గత ఐదారేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బెంగుళూరులోని అవహలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. ఐదారేళ్ల క్రితం బాధితురాలు తన స్నేహితుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్లో నిందితుడు ఆనందమూర్తికి పరిచయమైంది. అనంతరం బాధితురాలి జీవితంలో ప్రమాదం ఉందని, ఆమె కుటుంబ సభ్యులు కూడా చిక్కుల్లో ఇరుక్కుంటారని ఆనందమూర్తి యువతికి చెప్పాడు. తాను కాళికాదేవి భక్తుడిని, అన్ని సమస్యలు తీరుస్తానని నమ్మించాడు.
ఇవన్నీ నమ్మి బాధితురాలు అతడి ఇంటికి వెళ్లింది. పూజ చేయడానికి అని పిలిచి అనంతరం ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. తర్వాత ఆమెను రేప్ చేశాడు. దాన్ని నిందితుడి భార్య ఫోన్లో చిత్రీకరించింది. మత్తులోంచి తేరుకున్నాక బాధితురాలు వివస్త్రగా ఉంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని దొంగ స్వామీజీ బెదిరించాడు. దీంతో భయపడిన యువతి, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఐదారేళ్లు అమెను లైంగికంగా వాడుకుని, అతడు ఏం చెబితే అది వినేట్టుగా తన ఆధీనంలో పెట్టుకున్నాడని బాధితురాలి తరపున లాయర్ ఆరోపించాడు.
ఇలా వెలుగులోకి.. రెండు రోజుల క్రితం బాధితురాలి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పెళ్లికుమారుడికి బాధితురాలి వీడియోలు, ఫొటోలు పంపి నిశ్చితార్థం ఆగిపోయేలా చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులకు కాల్ చేసి, వారి కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా, ఈ విషయం పోలీసుకు చెప్పినా కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతడి భార్యపై రేప్, ప్రాణహాని, చీటింగ్ నేరాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించలేదని పెట్రోల్ పోసి తగలబెట్టాడు..
ప్రేమించలేదని అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ఉన్మాది. తీవ్రంగా గాయపడిన అమ్మాయిని ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా జరూహాడీ ప్రాంతలోని సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.