తమిళనాడులో మరో ఆన్లైన్ మోసం బయటపడింది(online fraud complaint). పెరంబర్ ప్రాంతంలో.. ఓ ఫేక్ స్నాప్‌డీల్ వెబ్‌సైట్‌కు(fake snapdeal call) బాధితుడయ్యాడు వినోద్ అనే వ్యక్తి. ఈ వ్యవహారంలో రూ. 5లక్షలు పోగొట్టుకున్నాడు.
ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వినోద్.. కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది ఫేక్ వెబ్సైట్ అని అతడికి తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ సైట్ నుంచి వస్తువులు కొనుగోలు చేశాడు. అది జరిగిన కొన్ని రోజులకు.. షూలు అతడికి ఫ్రీ గిఫ్ట్‌గా వచ్చాయి.
షూ అందుకున్న తర్వాతి రోజే, వినోద్‌కు ఆన్లైన్ పోర్టల్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. రూ. 18లక్షలు విలువైన బహుమతి అతడు పొందినట్టు, చెక్ పంపిస్తామని ఫోన్లో చెప్పారు. అందుకోసం వినోద్ రూ. 5లక్షలు చెల్లించాలన్నారు. అది నమ్మేసిన వినోద్.. రూ. 5లక్షలు కట్టేశాడు.