తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు - ఎస్​బీఐలో నకిలీ నోట్లు కలకలం

Fake Notes Found In SBI : రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాకే నకిలీ నోట్లను పంపించింది ఎస్​బీఐ. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని పుఖారాయం శాఖలో జరిగింది. దీనిని గమనించిన ఆర్​బీఐ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.​

Fake Notes Found In SBI
Fake Notes Found In SBI

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 11:27 AM IST

Fake Notes Found In SBI :ఎస్​బీఐలో నకిలీ నోట్లు లభ్యమవడం ఉత్తర్​ప్రదేశ్​లోని​ కాన్పుర్​లో కలకలం రేపింది. పుఖారాయంలోని ఎస్​బీఐ శాఖ నుంచి కొన్ని నకిలీ నోట్లను ఆర్​బీఐకి పంపింది. దీనిని గమనించిన ఆర్​బీఐ అధికారి.. పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు.. సంబంధిత బ్యాంక్​ అధికారులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
Fake Notes Caught In SBI Bank Today : భోగనిపుర్​ పరిధిలోని పుఖారాయం ఎస్​బీఐ శాఖ నుంచి కొంత నగదును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించారు. వీటిని ఆర్​బీఐ అధికారులు పరిశీలించగా.. అందులో కొన్ని ఫేక్​ నోట్లుగా తేలాయి. వెంటనే ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ పుఖారాయం శాఖను కోరింది. దీనిపై సంబంధిత బ్యాంక్ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆర్​బీఐ.. నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్ బ్యూరోలో నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఎస్​బీఐ శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. "రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా సెక్షన్ మేనేజర్​ ఐపీఎస్​ గహ్లోత్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. వెంటనే దర్యాప్తు చేపట్టాం. ఫేక్​ నోట్ల నిందితులను త్వరలోనే పట్టుకుంటాం" అని భోగనిపుర్​ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్​ ప్రమోద్​ కుమార్ శుక్లా తెలిపారు.

అన్నా.. చెల్లి.. ఓ 'నకిలీ నోట్ల తయారీ' కథా చిత్రమ్
Fake Currency Printing Gang Arrested in Hyderabad : ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఆ అన్నాచెల్లెళ్లు నకిలీ నోట్లు తయారు చేసి ఓసారి జైలుకెళ్లొచ్చారు. అయినా తీరు మార్చుకోకుండా.. రెండోసారి మరింత పెద్దఎత్తున తమ దందా కొనసాగించారు. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా వీరి ఆట కట్టించి.. కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి రూ.27 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్స్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యూట్యూబ్​లో చూసి నకిలీ కరెన్సీ ప్రింటింగ్.. అంతలోనే..!

Fake Currency: కలర్‌ ప్రింటర్​తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు

ABOUT THE AUTHOR

...view details