Fake ncb officers: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాము నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులమంటూ ఇద్దరు దుండగులు భయభ్రాంతులకు గురిచేయగా ఓ నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
Mumbai actress suicide: ముంబయికి చెందిన ఓ నటి(28) తన స్నేహితులతో కలిసి డిసెంబరు 20న ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీకి వెళ్లింది. అక్కడకు ఇద్దరు నకిలీ ఎన్సీబీ అధికారులు వచ్చి, డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే.. రూ.20 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. డబ్బుల కోసం నిందితులు.. ఆమెకు పదేపదే ఫోన్ చేసి విసిగించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబే(35)ను ఠాణెలో అరెస్టు చేశారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'ఎన్సీబీనే చేసింది'