ఫేస్బుక్.. తమ సిబ్బంది భద్రత దృష్ట్యా భజరంగ్ దళ్ సంస్థను నిషేధించటం లేదంటూ వచ్చిన వార్తలపై ఫేస్బుక్ భారత విభాగం ఎండీ అజిత్ మోహన్‌ను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది .
'భజరంగ్ దళ్‌ను నిషేధిస్తే ఇబ్బందా?' - అజిత్ మోహన్
ఫేస్బుక్.. తమ సిబ్బంది భద్రత దృష్ట్యా భజరంగ్ దళ్‌ను నిషేధించటం లేదంటూ వచ్చిన కథనాలపై ఫేస్బుక్ భారత విభాగం ఎండీ అజిత్ మోహన్‌ను ప్రశ్నించింది పార్లమెంటరీ కమిటీ.
కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో సమాచార, సాంకేతిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ... పౌరల వ్యక్తిగత సమాచార భద్రత విషయమై మోహన్‌కు సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివ్‌నాథ్ తుక్రాల్ ప్యానల్ ఎదుట హాజరయ్యారు. "భజరంగ్ దళ్‌ను నిషేధించాలని ఫేస్బుక్ అంతర్గత సమీక్షలో నిర్ణయం తీసుకున్నా... సంస్థ ఆర్థిక ప్రయోజనాలు, సిబ్బంది భద్రత దృష్ట్యా అలా చేయడం లేదు" అంటూ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని థరూర్‌తో కలిసి ప్రస్తావించారు కమిటీ సభ్యుడు కార్తీ చిదంబరం. ఈ వార్తలో నిజానిజాలపై ఫేస్బుక్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :పార్లమెంట్ కమిటీ భేటీ నుంచి రాహుల్ వాకౌట్