తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్‌బుక్‌లో ఏ పోస్టును ఎక్కువగా చూశారో తెలుసా?

భారత్​కు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు గౌర్‌ గోపాల్‌ దాస్‌.. ఫేస్​బుక్​లో పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించింది. ఈ పోస్టుకు ఏకంగా 80.6 మిలియన్ల వ్యూస్‌ లభించాయి.

facebook post
ఫేస్​బుక్ పోస్టు

By

Published : Aug 21, 2021, 7:41 AM IST

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ నెటిజన్లు ఎక్కువగా చదివిన వార్తల గురించి వెల్లడించింది. టాప్ పర్ఫార్మింగ్‌ కంటెంట్‌ తొలి రిపోర్టులో భాగంగా ఈ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా బీబీసీ నివేదిక ప్రకారం.. రాజకీయ అంశాలే కాకుండా మీమ్స్‌, వైరల్‌ ఛాలెంజెస్‌, ఆలోచింపజేసే ప్రశ్నలతోనూ ఫేస్‌బుక్‌ వ్యూస్‌తో ముందుకు దూసుకెళ్తోందని తేలింది. కాగా భారతదేశానికి చెందిన గౌర్‌ గోపాల్‌ దాస్‌ పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించింది.

"మీరు మొదట చూసిన పదాలే.. మీ రియాలిటీ" అంటూ పెట్టిన ఓ పోస్టుని ఏకంగా 80.6మిలియన్ల మంది చూశారట. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్ 30 వరకూ సేకరించిన ఫేస్‌బుక్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. గౌర్‌గోపాల్‌ దాస్‌.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా భారత్‌లో ప్రసిద్ధి.

పజిల్ పోస్టు

'పర్సనాలిటీ టెస్ట్‌' అంటూ ఆయన అడిగే ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అంతేకాదు.. జీవితం, వ్యక్తిత్వం, ఆలోచన తీరు వంటి అంశంలో ఆయనిచ్చే ప్రసంగాలు, సంధించే ప్రశ్నలు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో విశేష ఆదరణ ఉంటుంది.

ఇదీ చదవండి:యువతకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్స్‌- సీఎం హామీ!

ABOUT THE AUTHOR

...view details