తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మైనారిటీల గొంతు నొక్కే పొరపాట్లు చేయొద్దు' - మోదీపై నెటిజన్ల విసుర్లు

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఫేస్​బుక్​లో పెట్టిన పోస్ట్ తొలగింపుపై.. ఏర్పాటైన ఆ సంస్థ స్వతంత్ర మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలు దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలేనని అభిప్రాయపడింది.

Facebook
ఫేస్​బుక్​

By

Published : Apr 30, 2021, 8:11 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్​లను విమర్శిస్తూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టును ఫేస్​బుక్​ తొలగించడాన్ని.. ఆ సంస్థ ఏర్పాటుచేసిన స్వతంత్ర పర్యవేక్షణ మండలి తప్పుపట్టింది. మతపరమైన మైనారిటీల గొంతు నొక్కేలా పొరపాట్లు చేయకూడదని హితవు పలికింది.

భారత్​లో ప్రతిపక్షాల వాణిని కేంద్రం ఖాతరు చేయడం లేదని, మైనారిటీల ఆందోళనలనూ పట్టించుకోవడం లేదని పంజాబీ భాషలో ఓ వ్యక్తి ఫేస్​బుక్​లో గతంలో పోస్టు పెట్టారు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్​బుక్​ తొలుత దాన్ని తొలగించింది. అనంతరం పునరుద్ధరించింది.

ఈ వ్యవహారాన్ని పర్యవేక్షణ మండలి ఫిబ్రవరిలో విచారణకు స్వీకరించింది. సదరు పోస్ట్​ను తొలగిస్తూ ఫేస్​బుక్​ తొలుత తీసుకున్న నిర్ణయం తప్పు అని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details