తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైభవంగా 'ఈశా ఫౌండేషన్'​ మహాశివరాత్రి వేడుకలు - isha foundation mahashivratri

తమిళనాడు కోయంబత్తూర్​లో ఈశా ఫౌండేషన్​ ఆధ్యర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ భక్తులతో కలిసి​ ఆనందహేళితో నృత్యం చేశారు.

Exuberance & Devotion mark eclectic all-night celebrations at Isha yoga centre
ఈశా ఆధ్యర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

By

Published : Mar 11, 2021, 9:26 PM IST

Updated : Mar 11, 2021, 11:01 PM IST

వైభవంగా 'ఈశా ఫౌండేషన్'​ మహాశివరాత్రి వేడుకలు

తమిళనాడులోని కోయంబత్తూర్​లో ఈశా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల శివనామ స్మరణతో ఈశా కేంద్రం మార్మోగుతోంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది.

ఆది యోగి విగ్రహం
అలంకరణలతో నిండిన ఆది యోగి ప్రాంగణం
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సద్గురు జగ్గీవాసుదేవ్​
ఈశా కేంద్రంలో దీపార్చన

కార్యక్రమం ముందుగా ఈశా కేంద్రంలోని లింగ భైరవి యాత్రతో ప్రారంభమైంది. ప్రతీ ఏటా నిర్వహించేే విధంగా కాకుండా ఈ సారీ వర్చువల్​ విధానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముందుగా రిజిస్టర్​ చేసుకున్నవారిని మాత్రమే ప్రత్యక్ష కార్యక్రమాలకు అనుమతించారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
శివనామ స్మరణతో కోలాహలంగా మారిన ఈశా కేంద్రం
ఆకట్టుకుంటున్న సంప్రదాయ నృత్యాలు

రాత్రిపూట జరిగే కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యే వారు కరోనా నిబంధనలు పాటించిన వారినే ఈశా కేంద్రంలోకి అనుమతించారు.

ఈ రాత్రి అంతా జరిగే జాగారం.. చివరుకు మహా హారతితో ముగియనుంది.

Last Updated : Mar 11, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details