తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుదైన పాము స్మగ్లింగ్.. కోటి రూపాయలకు విక్రయం!.. అడ్డంగా బుక్కై..

రూ.కోటి విలువ చేసే పామును అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు స్మగ్లర్లు. ఈ ఘటన బంగాల్​లోని సిలిగుడిలో జరిగింది. పామును బిహార్ నుంచి తీసుకొచ్చి విక్రయించాలని ప్రయత్నించారు స్మగ్లర్లు.

Snakes Smuggling In West Bengal
బంగాల్​లో అరుదైన పాముల స్మగ్లింగ్​

By

Published : Feb 21, 2023, 10:24 PM IST

అంతరించిపోయే దశలో ఉన్న ఓ పామును అక్రమ రవాణా చేస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు కొందరు స్మగ్లర్లు. రూ.కోటి విలువ చేసే పామును వీరు స్మగ్లింగ్ చేస్తున్నారు. బంగాల్​లోని సిలిగుడిలో ఈ ఘటన జరిగింది. మొత్తం నలుగురు స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. సిలిగుడి మున్సిపాలిటీలోని శాస్త్రి నగర్​లో నిందితులు పట్టుబడ్డారని అధికారులు వెల్లడించారు. వారిని జల్పాయ్​గుడి కోర్టులో హాజరుపర్చారు. ఈ స్మగ్లింగ్ వెనక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టైన నిందితుల నుంచి 'రెడ్ శాండ్ బోవా' అనే అరుదైన జాతికి చెందిన సర్పాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మార్కెట్​లో ఇది రూ.కోటి వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు.

రూ.కోటి విలువ చేసే 'రెడ్​ శాండ్​ బొవా' జాతి పాము

ఆ పామును బిహార్ నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బైకాంతపుర్ ఫారెస్ట్ డివిజన్​లోని ఓ ఇంట్లో దీన్ని ఉంచారని చెప్పారు. దీనికి గురించి సమాచారం అందగానే.. బేలాకోబా రేంజ్ అధికారి సంజయ్ దత్తా నేతృత్వంలోని బృందం స్మగ్లర్లపై దాడి చేసింది. నాలుగు అడుగుల ఐదు అంగుళాలు ఉన్న పామును దత్తా టీమ్ స్వాధీనం చేసుకుంది. పాము 4.5 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు నిందితులను అరిందమ్ సర్కార్, పెషాంగ్ లామా షెర్పా, అన్వర్ మియా, జగదీశ్ చంద్ర రాయ్​లుగా గుర్తించారు.

రూ.కోటి విలువ చేసే 'రెడ్​ శాండ్​ బొవా' జాతి పాము

పామును విక్రయించేందుకే నిందితులు సిలిగుడికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీని గురించి ముందస్తు సమాచారం అందడం వల్ల నిందితుల ప్లాన్ ఫలించలేదని అన్నారు. 'పామును బిహార్ నుంచి అన్వర్ తీసుకొచ్చాడు. పాము ధరను రూ.కోటిగా నిర్ణయించారు. ముందుగా రూ.20వేలు అడ్వాన్స్​గా ఇవ్వాలని అరిందమ్​ను అన్వర్ డిమాండ్ చేశాడు. శాస్త్రి నగర్​లోనే డబ్బులు మార్చుకున్నారు' అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పెషాంగ్ లామాతో పాము స్మగ్లింగ్ విషయమై నిందితులు చర్చలు జరుపుతున్నారని అధికారులు వివరించారు. అతడితో డీల్ మాట్లాడుకునేందుకే వీరంతా శాస్త్రి నగర్​లో మకాం పెట్టారని చెప్పారు. మిగిలిన నిందితుల్లో ఎవరిది ఏ పాత్ర అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం ఏదైనా ఈ ఘటనలో ఉందేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details