పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది. 2020 జనవరి 10న అమల్లోకి వచ్చిన సీఏఏ నిబంధనలు రూపొందించేందుకు ఏప్రిల్ 9 వరకు లోక్‌సభ, జులై 9 వరకు రాజ్యసభ గడువు ఇచ్చినట్లు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
సాధారణంగా ఏదైన చట్టం అమల్లోకి వచ్చిన 6నెలల్లోపు నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది. కేంద్రం నియమ నిబంధనలు రూపొందించిన తర్వాత సీఏఏ పరిధిలోకి వచ్చే విదేశీయులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.