Explosives thrown by drone in Ajnala: పంజాబ్ ఎన్నికల వేళ మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ కలకలం రేపింది. అమృత్సర్ జిల్లాలోని రామ్‌దాస్ పోలీస్ స్టేషన్ పరిధి, అజ్నాలాలో ఓ డ్రోన్ భారత్‌లోకి ప్రవేశించింది.
డ్రోన్ సంచారంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రత దళం అధికారులు కాల్పులు చేశారు. పలు రౌండ్లు కాల్పులు జరపటం వల్ల డ్రోన్ పాకిస్థాన్ భూభాగంలోకి తిరిగి వెళ్లింది. డ్రోన్ నుంచి రెండు పసుపు రంగులోని వస్తువులు జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదేశం భారత సరిహద్దుకు 2.7 కిలోమీటర్ల దూరంలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు.
"పంజ్గ్రేన్ ప్రాంతంలోని గురుదాస్‌పుర్ సెక్టార్లో అర్ధరాత్రి 1 గంట సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి ఏదో ఎగురుతూ వస్తున్న శబ్దం వచ్చింది. దీంతో జవాన్లు కాల్పులు జరిపారు. అనంతరం గాగ్గర్, సింగోకే గ్రామాల్లో జరిపిన తనిఖీలు చేపట్టగా.. పసుపు రంగులోని రెండు వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. అందులో ఒక తుపాకి దొరికింది. వాటిని డ్రోన్ వదిలి వెళ్లింది అనుకుంటున్నాం."