తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలుడు- దంపతులు సజీవదహనం - రిఫ్రిజిరేటర్ పేలుడు

ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడం (Fridge Explosion) వల్ల భార్యాభర్తలు సజీవదహనం అయ్యారు. నిద్రిస్తున్న సమయంలో ఫ్రిజ్ పేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

fridge explosion
ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలుడు- దంపతులు సజీవదహనం

By

Published : Oct 26, 2021, 1:01 PM IST

ఒడిశాలోని కేందుఝార్ జిల్లాలో రిఫ్రిజిరేటర్ (Fridge Explosion) పేలి.. దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి తొమ్మిదేళ్ల కొడుకు.. కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

మృతులను లక్ష్మీ, పూర్ణచంద్ర దెహూరీగా (Odisha news today) గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. రిఫ్రిజిరేటర్ పేలిన (Fridge Explosion) సమయంలో వీరు తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. పేలుడు అనంతరం వేగంగా మంటలు (Fridge Fire) వ్యాపించాయి. నిమిషాల్లోనే మంటలు ఇంటిని కమ్మేశాయి. ఇది గమనించిన బాలుడు బరుణ్(Odisha news today).. ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు.

అగ్నికి ఆహుతైన దంపతుల మృతదేహాలు
.

బంధువుల ఇంట్లో పడుకోవడానికి వెళ్లిన తన సోదరుడిని పిలిచేందుకు వెళ్లాడు. పొరుగున ఉండేవారిని సాయం చేయాలని అభ్యర్థించారు. దంపతులను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భార్య భర్తలిద్దరూ (Fridge Explosion) మంటల్లో కాలిపోయారు.

పూర్ణచంద్ర మృతదేహం

ఇదీ చదవండి:ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details