భారత్‌లో కొవిడ్ మరణాల(Covid deaths in India) సంఖ్యపై గందరగోళం నెలకొంది. కేంద్రం చూపిన లెక్కల కన్నా 8 నుంచి 10 రెట్లు అధికంగా కరోనా(Covid-19) మరణాలు సంభవించాయని కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సహా ముగ్గురు పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. వాస్తవంగా మరణించినవారు దాదాపుగా 34 లక్షల నుంచి 49 లక్షల వరకు ఉంటారని పేర్కొన్నారు. ఈ అధ్యయనంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ లెక్కల్లో వాస్తవంలేదని నివేదికను తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో మరణాల లెక్కలు ప్రశ్నార్థకంగా మారాయి.
అరవింద్ సుబ్రమణియణ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణుడు అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ నిపుణుడు జస్టిన్ సాండెఫర్లు ఈ నివేదక రూపొందించారు.
మూడు విధానాలు..
భారత్‌లో సంభవించిన అదనపు మరణాలను అంచనా వేసేందుకు మూడు భిన్న నివేదికలపై అధ్యయనం చేశారు.
- భారత జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదు పరిశీలన.
- భారత్‌లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్లు
- సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) అనే ప్రైవేటు సంస్థ చేసిన ఆర్థిక సర్వేలో పాల్గొన్న 8 లక్షల మంది వివరాల పరిశీలన.
ఇదీ చదవండి:'కరోనా మరణాలు.. కేంద్రం లెక్కలకన్నా 10 రెట్లు అధికం!'
రహస్యంగా ఉంచడం వల్లే..
కొవిడ్‌తోనే కాకుండా ఇతర కారణాల వల్లా మరణించిన వారి డేటాను సేకరించినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే.. కొవిడ్ మొదటి దశ వ్యాప్తిలో మరణాల సంఖ్యను రహస్యంగా ఉంచడం వల్లే రెండో దశ ఉగ్రరూపం దాల్చిందని అభిప్రాయపడ్డారు.
అయితే.. ఎక్కడో అమెరికా, బ్రిటన్‌లో.. వయస్సు ఆధారంగా మరణాల రేటును గుర్తించేందుకు చేసిన అధ్యయనాలను.. ఇక్కడ కూడా వాడితే ఎలా అని ఆరోగ్య శాఖ ప్రశ్నించింది. రాష్ట్రాలు సేకరించిన సివిల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్(సీఆర్ఎస్) డేటాను, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సేకరించిన కన్స్యూమర్ పిరమిడ్ హౌస్‌హోల్డ్ సర్వే డేటాను కూడా తప్పుపట్టింది. మరణించిన వారందరి డేటాను సేకరిస్తే సరిపోదు.. దానికి కారణమేంటో కూడా తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో.. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 2,50,000 మంది మరణించినట్లు తెలిసింది. దీంతో పలువురు నిపుణులు.. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని రాష్ట్రాలు తప్పుడు లెక్కలు చూపుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కొత్త కేసుల్లో 'డెల్టా' రకమే అధికం!
మొదటి విధానంతో..