భారత్‌లో కొవిడ్ మూడో దశ విజృంభణపై భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఆరోగ్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు(covid third wave India). ఈ పండగ సీజన్లో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తారా? లేదా? అన్న అంశంపైనే దేశంలో థర్డ్ వేవ్ ఆధారపడి ఉందన్నారు(india third wave prediction). ఎట్టిపరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించకూడదని సూచించారు.
ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఉద్భవిస్తే.. మూడో దశ వ్యాప్తికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. పండగ సీజన్లో రద్దీ ప్రాంతాలు కొత్త వేరియంట్ విజృంభణకు సూపర్ స్ప్రెడర్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
"సామాజిక, మతపరమైన సమావేశాలతో డెల్టా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఇప్పటివరకు కొవిడ్ బారిన పడని వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేసి, సమావేశాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలను పాటించాలి. ప్రస్తుతానికి దేశంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఇది మంచి విషయమే. కానీ రానున్న పండగ సీజన్‌తో జాగ్రత్తగా ఉండాలి. భారీ సభలు, సూపర్-స్పెడర్ ఈవెంట్లు.. థర్డ్ వేవ్ విజృంభణకు కారణమయ్యే అవకాశముంది. దేశంలో మెరుగైన స్థితిలో ఉండాలంటే రానున్న 2-3 నెలలు అత్యంత కీలకం."
--- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరక్టర్.
మరోవైపు రోజువారీ కేసులు తక్కువగానే ఉన్నా, దేశంలో కొవిడ్ పరిస్థితులకు వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు ప్రజా ఆరోగ్య నిపుణులు చంద్రకాంత్ లహరియా. సభలు, ఫంక్షన్లు.. చిన్నవైనా, పెద్దవైనా.. కొవిడ్ వ్యాప్తికి కారణమవుతాయని ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉదాహరణలున్నట్టు గుర్తుచేశారు. అందువల్ల టీకా రెండు డోసులు తీసుకోని ప్రజలు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు(India third wave news).