తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'3 నెలల తర్వాత కొవిషీల్డ్ టీకా రక్షణ తగ్గదు..​' - కొవిషీల్డ్ లాన్సెట్ అధ్యయనం

Covishield protection: కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో మూడు నెలల తర్వాత రక్షణ తగ్గుతుందని లాన్సెట్​ అధ్యయనంలో తప్పుగా ఉదహరించారని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనంలో ఉపయోగించిన మెథడాలజీ కొత్తగా ఉందని, ఇప్పటివరకు అలాంటి దాని గురించి ఎవరికీ తెలియదన్నారు. మరోవైపు కొవిషీల్డ్​ బూస్టర్​ డోసుతో ఒమిక్రాన్​ను నిలువరించవచ్చని ఆక్స్​ఫర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. మూడో డోసు ఒమిక్రాన్​ వేరియంట్​పై ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలిందన్నారు.

Covishield  protection
'3 నెలల తర్వాత కొవిషీల్డ్ టీకా రక్షణ తగ్గదు- బూస్టర్​ డోసుతో ఒమిక్రాన్​కు చెక్​'

By

Published : Dec 24, 2021, 5:07 AM IST

Covishield protection: కొవిషీల్డ్ టీకా తీసుకున్న 3 నెలల తర్వాత రక్షణ తగ్గుతుందని లాన్సెట్ వెల్లడించిన అధ్యయనంలో పలు విషయాలను తప్పుగా ఉదహరించాలని నిపుణులు చెప్పారు. భారత వైద్య పరిశోధన మండలి (IMA) అధ్యక్షుడు డా. జేఏ జయల ఈ మేరకు తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ వివరాలను పరిశీలిస్తే వ్యాక్సిన్లు యాంటీబాడీలు, టీ సెల్స్​తో రక్షణ కల్పిస్తున్నట్లు ఆధారాలున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశోధనను పరిశీలించినా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత యాంటీబాడీలు ఆగిపోలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఆందోళన అంతా టీ సెల్స్ ఎంతకాలం పాటు రక్షణ కల్పిస్తాయనే విషయంపై మాత్రమే అన్నారు. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత, కొవిషీల్డ్​ టీకా ద్వారా ప్యాసివ్​ ఇమ్యూనిటీ పొందినా టీ సెల్స్​ దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయని వివరించారు.

" లాన్సెట్​ అధ్యయనంలో ఉపయోగించిన మెథడాలజీ కొత్తగా ఉంది. నేను, నా పీర్​ టీం సహా చాలా మందికి దీని గురించి అస్సలు తెలియదు. అయితే పరిశోధనకర్తలకు తప్పబట్టడం లేదు. కానీ ఓ పరిశోధనను ముగించేటప్పుడు ​ మెథడాలజీనే అత్యంత కీలకం. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా గుడ్డిగా కన్​క్లూడ్​ చేయొద్దు. ఈ అధ్యయనాన్ని పరిశోధనకర్తే ముగించారు. అందుకే తప్పుగా ఉదహరించారు. "

డా. జేఏ జయల, ఐఎంఏ అధ్యక్షుడు

ఒమిక్రాన్​పై ప్రభావవంతం..

వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తమ బూస్టర్‌ డోసు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ లాబ్‌ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొంది. ఆస్ట్రాజెనెకా మూడోడోసుతో ఒమిక్రాన్‌ తటస్థీకరణ స్థాయులు రెండు డోసులు తీసుకున్న తర్వాత డెల్టాతో సమానంగా ఉన్నాయని తెలిపింది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా రోగం ముదరకుండా టీ-సెల్స్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. రక్షణ వ్యవస్థలో కీలకభాగం మహమ్మారిపై పోరాటం చేస్తుందన్నారు. వైరస్‌ సోకి సహజసిద్ధంగా బయటపడినవారిలో కంటే.. బూస్టర్‌ డోస్‌ తర్వాత ఒమిక్రాన్‌ వ్యతిరేక యాంటీబాడీస్‌ స్థాయిలు ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. లాబ్‌ డేటా ప్రాథమిక ఫలితాలు సానుకూలంగా ఉన్నందున ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి టీకా ఉత్పత్తిలో నిమగ్నమైనట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది.

ఇదీ చదవండి:కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్​పై గెలుపు ఇక సులువయ్యేనా?

ABOUT THE AUTHOR

...view details