Man Sentenced For Kissing on Women Cheek: ఓ మహిళను ముద్దు పెట్టుకున్న కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల తర్వాత ముంబయి కోర్టు కఠిన శిక్షను విధించింది. 2015 అగష్టు 23న ఓ మహిళ తన స్నేహితులతో కలిసి గోవాండి నుంచి సీఎస్ఎమ్టీ రైల్వే స్టేషన్కు రైలులో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కి రాగానే ఆమె బుగ్గలపై ఓ వ్యక్తి ముద్దుపెట్టాడు. రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. నిందితుడిని గోవాకు చెందిన కిరణ్ సుజా హోనా(37)గా పోలీసులు గుర్తించారు.
మహిళ బుగ్గలపై ముద్దు- ఏడాది జైలుశిక్ష - Man Sentenced For Kissing on Women Cheek in goa
Man Sentenced For Kissing on Women Cheek: ఓ మహిళ చెంపలపై ముద్దుపెట్టిన కేసులో ఓ వ్యక్తిని ఏడేళ్ల తర్వాత దోషిగా తేల్చింది ముంబయి కోర్టు. ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షను విధిస్తు తీర్పునిచ్చింది.
cd
హోనాను అరెస్టు చేసి.. కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. సాక్ష్యాధారాలను పరిశీలించి, ఏడేళ్ల పాటు విచారణ అనంతరం కోర్టు నిందితున్ని దోషిగా తేల్చింది. ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రూ.10,000 జరిమానా కూడా విధించింది. తీర్పు అనంతరం పోలీస్ ఇన్స్పెక్టర్ మహబూబ్ ఇనామ్దార్ మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:చదివేది నర్సింగ్.. ఆర్మీ ఆఫీసర్గా చలామణీ
Last Updated : Mar 31, 2022, 11:38 AM IST