బిహార్ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
- తేజస్వి యాదవ్‌కు 44 శాతం మద్దతు
- నీతీశ్‌కుమార్‌కు 35 శాతం మద్దతు
- చిరాగ్ పాస్వాన్‌కు 7 శాతం మద్దతు
19:18 November 07
బిహార్ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
18:58 November 07
బిహార్ ఎన్నికల్లో మహాకూటమికే మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా బిహార్ బరిలోకి దిగగా.. ఆ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని... పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీఏ కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎన్డీఏ కూటమికి 104 నుంచి 128 స్థానాలు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ అంచనా వేసింది. మహాకూటమికి 108 నుంచి 131 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది.
జేడీయూపై వ‌్యతిరేకతతో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ.. ఒకటి నుంచి మూడు స్థానాలకే పరిమితం అవుతుందని ఏబీపీ-సీ ఓటర్ అంచనా వేసింది.
ఎన్డీఏ కూటమి 116, మహాకూటమి 120 స్థానాలు గెలుచుకునే అవకాశముందని టైమ్స్ నౌ-సీ ఓటర్ వెల్లడించింది. ఎల్జేపీ ఒక్క సీటు మాత్రమే సాధించే అవకాశముందని తెలిపింది. ఇతరులు ఆరు చోట్ల గెలవచ్చని అంచనా వేసింది.
రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ అంచనా ప్రకారం.. ఎన్డీఏ 91 నుంచి 117 సీట్లు గెలుచుకునే అవకాశముంది. మహాకూటమి 118 నుంచి 138 స్థానాలున్నాయని.. అంచనా వేసింది. ఎల్జేపీ 5 నుంచి 8, ఇతరులు 3 నుంచి ఆరు చోట్ల గెలిచే అవకాశమున్నట్లు రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ అంచనా వేసింది.
18:46 November 07
రిపబ్లిక్ జన్ కీ బాత్
18:40 November 07
బిహార్ ఏబీపీ న్యూస్
18:33 November 07
టైమ్స్ నౌ - సీ ఓటరు
18:30 November 07
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన పీపుల్స్ పల్స్ సంస్థ
18:20 November 07
17:47 November 07
లైవ్: బిహార్ ఎగ్జిట్ పోల్స్
బిహార్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో వెలువడనున్నాయి. బిహార్‌లో 3 విడతలుగా జరిగిన శాసనసభ ఎన్నికలు జరిగాయి. బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది ఈసీ