అసోంలో భాజపా మరోసారి అధికారం నిలబెట్టుకోనుందని వివిధ సంస్థలు ఎగ్జిట్‌పోల్ ఫలితాలను విడుదల చేశాయి. భాజపా కూటమి 61 నుంచి 79 నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని టుడేస్ చాణక్య ప్రకటించింది. కాంగ్రెస్ కూటమి 47 నుంచి 65 సీట్లు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించనున్నట్టు పేర్కొంది.
ఆక్సిస్ మై ఇండియా సర్వే..
అసోంలో రెండోసారి భాజపా కూటమి జయకేతనం ఎగురవేస్తుందని ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించింది. భాజపా 75 నుంచి 85 స్థానాలు, కాంగ్రెస్ కూట 40 నుంచి 50 సీట్లు.. ఇతరులు ఒకటి నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించనున్నట్లు వెల్లడించింది.
ఆజ్‌తక్ అంచనాలిలా..
అసోంలో కాషాయ దళం రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆజ్‌తక్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ప్రకటించింది. కమలం పార్టీ 75 నుంచి 85 సెగ్మెంట్లలో గెలుపొందుతుందని ఆజ్‌తక్ విడుదల చేసింది. కాంగ్రెస్ కూటమి 40 నుంచి 50 స్థానాలు గెలుపొందుతాయని పేర్కొంది.