తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 12:53 PM IST

Updated : Jan 24, 2021, 1:27 PM IST

ETV Bharat / bharat

రఫేల్​ పైలెట్లతో 'ఈటీవీ భారత్'​ ముఖాముఖి

భారత్, ఫ్రాన్స్ వాయుదళాలు సంయుక్తంగా నిర్వహించిన 'ఎక్స్ డిజర్ట్ నైట్' విన్యాసాల్లో రఫేల్​ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇందులో రఫేల్​ యుద్ధ విమానాలను నడిపిన ఫ్రెంచ్​, భారత పైలెట్లను 'ఈటీవీ భారత్​' పలకరించింది. ​రఫేల్​ విమానాల్ని నడిపే సమయంలో అనుసరించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడ్డాయని వారు తెలిపారు.

Rafale
రఫేల్

భారత్, ఫ్రాన్స్ వాయుసేనలు కలిసి నాలుగు రోజుల పాటు నిర్వహించిన మెగా డ్రిల్ శనివారం ముగిసింది. 'ఎక్స్ డిజర్ట్ నైట్' పేరిట జోధ్​పుర్​లో ఈ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్, ఫ్రాన్స్​కు చెందిన రఫేల్ విమానాలు పాల్గొని, కఠినమైన విన్యాసాలను ప్రదర్శించాయి. అయితే ఈ విమానాలను నడిపిన భారత్​ సహా ఫ్రాన్స్​ పైలెట్లను 'ఈటీవీ భారత్'​ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు చెెప్పిన విశేషాలు మీకోసం.

రఫేల్​ పైలెట్లతో 'ఈటీవీ' భారత్​ ముఖాముఖి
రఫేల్ పైలెట్లు
రఫేల్ అద్భుత విన్యాసాలు​
విన్యాసాల్లో రఫేల్​

"ఇది చాలా మంచి అనుభవం. రఫేల్​ విమానాన్ని నడపడం చాలా బాగుంది. భారత్​- ఫ్రాన్స్​ బంధం చాలా బలమైనది. తెలిసిన విషయాలను పరస్పరం పంచుకున్నాం."

- ఫ్రాన్స్​ పైలెట్

"ఈ విన్యాసాల ద్వారా ఎంతో నేర్చుకున్నాం. ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్​ విమానాల్ని వారితో పాటే నడపడం మంచి అనుభవం. మా పైలెట్ల దగ్గర నుంచి కూడా వాళ్లు కొన్ని విషయాలు నేర్చుకున్నారు. పరిస్థితులకు తగ్గట్లు రఫేల్​ విమానాల్ని ఎలా నడపాలి వంటి సాంకేతిక అంశాలపై మంచి అవగాహన వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మన వద్ద సేవలు అందిస్తోన్న సుఖోయ్ సహా పలు యుద్ధ విమానాలతో రఫేల్​ కలవడం మన శక్తిని మరింత పెంచింది. ప్రపంచంలో ఏ శక్తి వీటిని ఛేదించలేదు."

- నవీన్​ కౌశిక్, భారత పైలెట్

ఈ విన్యాసాల్లో మిరాజ్, సుఖోయ్​ విమానాలతో పాటు, గగనతల హెచ్చరిక వ్యవస్థ, ఐఎల్-78 ఫ్లైట్ రీఫ్యూయెలింగ్ విమానం సైతం పాల్గొన్నాయి.

Last Updated : Jan 24, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details