Ex Union Minister Chinta Mohan on AP TS Politics: ఏపీలో కక్షపూరిత రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై, మార్గదర్శి, రామోజీరావుపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మణిపూర్ ఘటన వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.
స్కిల్ కేసులో ఆధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్టు చేశారని చింతా మోహన్ మండిపడ్డారు. ఆధారాలు లేకుండా అనుమానాలతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ చేస్తున్న పనులను తీవ్రంగా ఖండించారు. స్కిల్ కేసులో అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మంచివారని.. రాజకీయ కారణాలు వ్యక్తిగత కారణాలతో ద్వేషపూరిత రాజకీయాలు మంచివి కావన్నారు. రాజకీయాలు వేరు అవినీతి కేసులు వేరన్నారు. కేసులు పెట్టడం పెద్ద పొరపాటు చర్య అని అన్నారు.
Chinta Mohan on Srikalahasti Temple: 'శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అవినీతి జరుగుతోంది'
మార్గదర్శి, రామోజీరావుపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 40 ఏళ్లుగా రామోజీరావు తనకు బాగా తెలుసు అని వివరించారు. రామోజీ సంస్థలపై జగన్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు, మార్గదర్శిపై తీసుకుంటున్న చర్యలు సరికాదని తప్పుబట్టారు.
జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు.. ప్రతిపక్ష నాయకులకు ఎంత గౌరవమిస్తే అధికార పక్షానికి అంత గౌరవం పెరుగుతుందని సూచించారు. బీజేపీ, వైసీపీ కుట్ర వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని అన్నారు. జగన్‌ను నమ్మిన ఎస్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Chintha Mohan on Jagan: 'హత్యలు-ఆత్మహత్యలు, జైళ్లు-బెయిళ్లు'.. ఇదే జగన్ 4 ఏళ్ల పాలన: చింతా మోహన్
ఏపీలో 6 నెలల క్రితం వరకు కాంగ్రెస్ ఒక్క శాతం ఓటు బ్యాంకుతో ఉన్నట్లు వివరించారు. గడిచిన 3, 4 నెలల్లో 10 నుంచి 15 శాతం ఓటుబ్యాంకు పెరిగిందని పేర్కొన్నారు. ముస్లింలు 5 శాతం మంది కాంగ్రెస్ వైపు వచ్చినట్లు తెలిపారు. మణిపూర్ ఘటనతో క్రైస్తవులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు ఏపీలో చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అక్కడ ఉన్న డీఎంకే, అన్నడీఎంకే పార్టీల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. ఏపీలో కూడా ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించిన చింతా మోహన్:తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 72 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోష్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
Chinta Mohan Comments: వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే మార్గదర్శిపై దాడులు:చింతామోహన్