రూ.200 కోట్లు విలువ చేసే హాటల్‌ను నిరర్థక ఆస్తి పేరుతో రూ. 25 కోట్లకు విక్రయించారు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..?
రాజస్థాన్ జైసల్మేర్‌కు చెందిన ఓ హోటల్ గ్రూప్.. 2008లో ఎస్బీఐ నుంచి రూ. 24కోట్లు రుణం పొందింది. ఆ తర్వాత రుణం చెల్లించని క్రమంలో నిరర్థక ఆస్తి(ఎన్పీఏ) కింద.. సదరు సంస్థకు చెందిన రెండు హోటళ్లనూ బ్యాంకు జప్తు చేసింది. ఆ సమయంలో ఎస్బీఐ ఛైర్మన్‌గా ప్రతీప్ చౌదరి ఉన్నారు.
ఆ హోటళ్లను నిరర్థక ఆస్తులుగా ప్రకటించి రూ. 25కోట్లకు వేరొక సంస్థకు విక్రయించారు ప్రతీప్. పదవీ విరమణ పొందాక.. హోటళ్లను విక్రయించిన కంపెనీకే డైరెక్టర్‌గా మారారు.
2017లో ఆ హోటళ్ల విలువ దాదాపు రూ.160 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 200కోట్లకు చేరింది. ఈ వ్యవహారంలో హోటల్ గ్రూప్ యజమాని.. జైసల్మేర్ కోర్టును ఆశ్రయించగా.. ప్రతీప్ చౌదరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దిల్లీలో ఉన్న ప్రతీప్‌ను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:'మోదీ సభలో ఉగ్రదాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష