Former Kenya PM praises Ayurveda : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటిస్తున్న డింగాతో మోదీ భేటీ అయ్యారని, సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయనతో భేటీ అవడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్-కెన్యాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు వెల్లడించింది.
'నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగాతో భేటీ అవడం సంతోషంగా ఉంది. భారత్‌లో, కెన్యాలో ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను మళ్లీ గుర్తు చేసుకున్నాను' అని మోదీ ఓ ట్వీట్ చేశారు. 2008 నుంచి 2013 వరకు డింగా కెన్యా ప్రధానమంత్రిగా పనిచేశారు.