తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు హత్యలు చేసి 11 ఏళ్లుగా పరారీ- పెన్షన్ డ్రా చేస్తూ పోలీసులకు...

Ex-Iaf Man held after 11 years: ఇద్దరు పిల్లలు సహా భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు అతడు. అరెస్టయ్యాక కారంపొడి జల్లి.. పోలీసుల చెర నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. వేరే ప్రాంతానికి చేరుకుని మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు. అలా 11 ఏళ్లపాటు పరారీలో ఉన్న అతడ్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Ex-IAF man held after 11 years
ట్రిపుల్ మర్డర్ చేసి 11 ఏళ్లుగా పరారీ

By

Published : Dec 8, 2021, 12:34 PM IST

Updated : Dec 8, 2021, 1:00 PM IST

Ex-Iaf Man held after 11 years: భార్య, బిడ్డలను హత్య చేసి 11 ఏళ్లపాటు పరారీలో ఉన్న భారత వాయు సేన(ఐఏఎఫ్​) మాజీ ఉద్యోగి.. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. రెండో భార్యతో వేరే ప్రాంతంలో ఉన్న అతడ్ని సోమవారం అరెస్టు చేశారు.

అసలేమైందంటే..?

Dharam singh yadav: ఐఏఎఫ్​ మాజీ ఉద్యోగి అయిన ధరమ్​ సింగ్​ యాదవ్.. బెంగళూరులో 2008 అక్టోబరు 19న తన భార్య అను యాదవ్​(35), పిల్లలు కీర్తి(4), శుభమ్​(8)ను గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తన భార్య మెడలో నుంచి బంగారు ఆభరణాలను తీసివేశాడు. ఆపై పోలీసులకు ఈ హత్య గురించి తానే ఫిర్యాదు చేశాడు. అయితే.. దర్యాప్తులో ధరమ్​ సింగే ఈ హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అతడ్ని అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

నిందితుడు ధరమ్​ సింగ్​ యాదవ్

కళ్లల్లో కారం జల్లి...

Escape threw chilli powder: రెండేళ్ల రెండు నెలలపాటు జైల్లో గడిపిన ధరమ్​సింగ్.. పొత్తి కడుపు నొప్పి పేరుతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో 2010లో చికిత్స కోసం చేరాడు. అయితే.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పథకం పన్నాడు​. పోలీసు కానిస్టేబుళ్లపై కారం పొడి జల్లి, ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ధరమ్​ సింగ్​పై వీవీ పుర పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి పరారైన అతడు.. హరియాణాకు చేరుకున్నాడు. అక్కడ మారుపేరుతో ఓ లిక్కర్ షాపు నిర్వహించసాగాడు. 2012లో ఓ మ్యాట్రిమోని వెబ్​సైట్​ ద్వారా ఫేక్​ ప్రొఫైల్ సృష్టించి.. అసోంకు చెందిన ఓ మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడు.

ex iaf man kills wife and children: 11 ఏళ్లుగా ధరమ్​ సింగ్​ యాదవ్​ను అరెస్టు చేయకపోవడంపై బెంగళూరు హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు.. అతడ్ని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన పదవీ విరమణకు సంబంధించిన పింఛను సొమ్మును ధరమ్ సింగ్ తీసుకుంటున్నాడనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దాని ఆధారంగా హరియాణాలో అతడ్ని పట్టుకున్నారు.

"1987లో ఐఏఎఫ్​లో చేరిన ధరమ్ సింగ్​ యాదవ్​... 1997లో పదవీ విరమణ పొందాడు. హరియాణాకు చెందిన అతడు తన రాజీనామా అనంతరం బెంగళూరులో నివసించాడు. తన మొదటి భార్య అనుయాదవ్​తో గొడవలు తలెత్తి ఆమెను, పిల్లలను హత్య చేశాడు" అని ఓ పోలీసు అధికారి వివరించారు.

ఇదీ చూడండి:చెల్లి పెళ్లికి వారం ముందే అన్న ఆత్మహత్య- నగలు కొనేందుకు లోన్​ రాలేదని...

ఇదీ చూడండి:Benz car crash: ఐదు వాహనాల్ని ఢీకొట్టిన బెంజ్ కారు- ఒకరు మృతి

Last Updated : Dec 8, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details