తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ లేఖలో ఎలాంటి వాస్తవం లేదు'.. మోదీకి బ్యూరోక్రాట్ల లేఖ - ప్రధాని మోదీకి లేఖ

Ex-Bureaucrats Letter to PM: దేశంలో విద్వేష రాజకీయాలపై మాజీ బ్యూరోక్రాట్లు లేఖ రాయడాన్ని పూర్వ న్యాయమూర్తులు, సివిల్​ సర్వెంట్లు తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని బాధ్యుడ్ని చేస్తున్న వారు రాసిన లేఖలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ మేరకు మోదీకి లేఖ రాశారు.

pm modi
pm modi

By

Published : Apr 30, 2022, 10:50 PM IST

Ex-Bureaucrats Letter to PM: దేశంలోని విద్వేష రాజకీయాలకు బాధ్యుడ్ని చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ సివిల్​ సర్వెంట్లు లేఖ రాయడాన్ని పూర్వ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు తప్పుపట్టారు. ప్రజలు మోదీ పక్షాన ఉండటం చూసి ఓర్వలేకే వారు ఆ లేఖ రాసినట్లు ఆరోపించారు. ఈ మేరకు ప్రధానికి మరో లేఖ రాసిన మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు సైన్యాధికారులు, మాజీ ఐఏఎస్​ల రాతల్లో ఎలాంటి వాస్తవం లేదని తోసిపుచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా విజయాన్ని ఓర్వలేకే వారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడ్డారు.

లేఖ రాసిన వారి కోపం, వేదన శూన్యమన్న మాజీ న్యాయమూర్తుల బృందం తప్పుడు చిత్రీకరణలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీకి లేఖ రాసిన వారిలో 8 మంది మాజీ న్యాయమూర్తులతో పాటు 97 మంది మాజీ ఐఏఎస్​లు, 92 మంది రిటైర్డ్‌ సైన్యాధికారులు ఉన్నారు. అంతకుముందు ప్రధానికి 108 మంది మాజీ ఐఏఎస్​ల బృందం లేఖ రాసింది. భాజపా పాలిత రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విద్వేష రాజకీయాలకు స్వస్తిపలకాలని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల్లోని మైనారిటీలపై జరుగుతున్న ఉన్మాద దాడులను లేఖలో ప్రస్తావించింది.

ఇదీ చూడండి :సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!

ABOUT THE AUTHOR

...view details