తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం నోటీసులకు ఆలాపన్​ వివరణ​ - బంగాల్​ ఎక్స్​ సీఎస్​

ప్రధాన మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవటంపై కేంద్రం పంపిన షోకాజ్​ నోటీసులకు సమాధానమిచ్చారు బంగాల్​ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బంధోపాద్యాయ్​. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల ప్రకారం ఆ సమయంలో తాను దిఘాలో పర్యటించానని చెప్పారు.

Ex-Bengal chief secy,  Alapan Bandyopadhyay
బంగాల్​ మాజీ సీఎస్​

By

Published : Jun 3, 2021, 10:02 PM IST

కేంద్రం జారీ చేసిన షోకాజ్​ నోటీసులకు బంగాల్ ప్రభుత్వ​ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్​) ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ వివరణ ఇచ్చారు. తుపాను నేపథ్యంలో మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి అలాపన్​ గైర్హాజరీపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఆయనకు కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. అయితే.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల మేరకు తాను 'యాస్'​ తుపాను ప్రభావిత ప్రాంతమైన తూర్పు మెదినీపుర్ జిల్లాలోని దిఘాకు వెళ్లానని కేంద్రానికి ఆలాపన్​ సమాధానమిచ్చారు. మే 31న ఆయనకు కేంద్ర హోం శాఖ ఈ​ నోటీసులు జారీ చేసింది.

ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ విషయంలో మోదీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య రగడ నడుస్తోంది. మే 31న సీఎస్​ పదవికీ ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. దిల్లీలో రిపోర్ట్​ చేయాలని కేంద్రం లేఖ పంపింది. ఈ నేపథ్యంలో కీలక ఎత్తుగడ వేశారు సీఎం మమతా బెనర్జీ. సీఎస్​గా కొనసాగించకుండా పదవీ విరమణ చేయించి.. సీఎంకు ముఖ్య సలహాదారుగా ఆయనను నియమించారు. మంగళవారం నుంచే అది అమలులోకి వస్తుందని.. వచ్చే మూడేళ్ల పాటు తనకు సలహాదారుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details