దేశంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇందుకోసం రాజకీయంగా ఏకాభిప్రాయం తీసుకురావాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
"కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానాన్ని రూపొందించాలి. దానిపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని సేకరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై తమ విధులను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి