తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈవీఎం, వీవీప్యాట్​లకు​ 100 శాతం ట్యాలీ'

ఈవీఎం, వీవీప్యాట్​ల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువు అయిందని ఈసీ వ్యాఖ్యానించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం, వీవీప్యాట్​ స్లిప్​ల సంఖ్య 100 శాతం ట్యాలీ అయిందని స్పష్టం చేసింది.

evm vvpat tally, ఈవీఎం వీవీప్యాట్​ ట్యాలీ
ఈవీఎం, వీవీప్యాట్​లపై ఈసీ

By

Published : Jun 3, 2021, 5:15 PM IST

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రం​ (ఈవీఎం), ఓటర్​ వెరిఫయబుల్​ పేపర్​ ఆడిట్​ ట్రయల్స్​ (వీవీప్యాట్​) స్లిప్​ల మధ్య సంఖ్య 100 శాతం ట్యాలీ అయిందని ఎన్నికల కమిషన్​ వెల్లడించింది. దీంతో ఈ యంత్రాల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువు అయ్యాయని ఈసీ అధికారి పేర్కొన్నారు.

2021 ఎన్నికల నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీకి లేఖ రాశారు. ఈవీఎం సంఖ్యకు సరిపడా వీవీప్యాట్​ స్లిప్​లు ఉన్నాయో లేదో ట్యాలీ చేయాలని కోరారు.

వీవీప్యాట్​ల స్లిప్​లను లెక్కించాలని డిమాండ్​ చేస్తూ ప్రతిపక్షాలు ఇదివరకు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాయి. 2019 ఏప్రిల్​లో సుప్రీం​ ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ.. ప్రతి నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలకు వీవీప్యాట్​ల స్లిప్​లను లెక్కించాలని ఆదేశించింది.

నిబంధన ప్రకారం ఒకవేళ ఈవీఎం, వీవీప్యాట్​ల మధ్య లెక్కలో అవకతవకలు వస్తే వీవీప్యాట్​ సంఖ్యనే ఈసీ పరిగణిస్తుంది.

ఇదీ చదవండి :ఈసీ అడ్డగోలు వాదనలు - సుప్రీంకోర్టు మొట్టికాయలు

ABOUT THE AUTHOR

...view details