Supreme Court on EVM today: దేశంలో చాలా కాలంగా చర్చనీయాంశమైన బ్యాలెట్- ఈవీఎం వివాదం.. సుప్రీం కోర్టుకు చేరింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పించేలా.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధన చట్టబద్ధతను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. ఆ చట్టంలోని 'సెక్షన్ 61ఏ'కు పార్లమెంటు ఆమోదం లేదని, కాబట్టి అమలు చేయరాదని వాదిస్తూ.. న్యాయవాది ఎమ్ఎల్ శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించాలని కోరారు.
'ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్'.. విచారణకు సుప్రీం ఓకే - supreme court on evm today
Supreme Court on EVM today: బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈవీఎంలను ప్రవేశపెట్టేందుకు వీలుగా.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధనను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
'ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్'.. విచారణకు సుప్రీం ఓకే
శర్మ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. త్వరలోనే దీనిపై వాదనలు ప్రారంభమయ్యే అవకాశముంది.
Last Updated : Jan 19, 2022, 1:40 PM IST