తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదృశ్య సరస్వతి నదీగర్భంలో భారీగా నీరు, ఇసుక! - సరస్వతి నది ఆవిర్భావం అమెరికన్ జియోఫిజికల్ యూనియన్

Evidence of saraswati river: గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రాంతంపై కీలక విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.మీ వరకు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు.

saraswati river
సరస్వతి నది

By

Published : Dec 18, 2021, 3:03 PM IST

Updated : Dec 19, 2021, 2:52 PM IST

Evidence of saraswati river: కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి 2016లోనే నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ల క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని దాని సారాంశం. అంతేకాకుండా భూ గర్భంలో సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన జలవనరుల నిపుణులు అప్పట్లో పేర్కొన్నారు.

సరస్వతి నది

Saraswati river Water

అయితే, హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.మీ వరకు (హిమాలయాల వైపు) సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు కి.మీ. వెడల్పున, 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు.

గంగ, యమున నదుల నీటికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సరస్వతి నది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ జర్నల్‌ ఈ నెల ఒకటో తేదీన ప్రచురించింది.

ఇదీ చదవండి:'నల్లా నీరు పట్టుకోవద్దు.. గుడిలోకి రావద్దు'- దళిత మహిళపై ఆంక్షలు

Last Updated : Dec 19, 2021, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details