అఫ్గానిస్థాన్ సంక్షోభంపై(Afghan crisis) కీలక వ్యాఖ్యలు చేశారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్(CDS General Bipin Rawat). ముందుగా ఊహించినట్లే ప్రతీది జరిగిందన్నారు. కేవలం సమయం మాత్రమే మారిందని పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుంటారనే విషయాన్ని భారత్ ముందుగానే ఊహించిందని చెప్పారు. ఈ మేరకు అమెరికా, భారత్ భాగస్వామ్యం 21వ శతాబ్ద భద్రతపై జరిగిన సమావేశంలో మాట్లాడారు.
"అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు ఉగ్రవాదం వ్యాపిస్తుందని మేం ఆందోళన చెందాం. అందుకే మేం ముందస్తుగా ఆ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాం. కొన్ని నెలల ముందు నుంచే అఫ్గాన్‌లో జరగబోయే పరిణామాలను మేం అంచనా వేస్తూ వచ్చాం. అయితే.. సమయం మాత్రమే మారింది తప్ప ఇంకా ఏమీ లేదు. 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఎలా ఉన్నారో ఇప్పుడు తాలిబన్లు అలాగే ఉన్నారు."
-బిపిన్ రావత్, త్రిదళాధిపతి.