Covid Impact On Male Fertility: కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై చేసిన అధ్యయనంలో మరో సంచలన విషయం వెల్లడైంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని.. ఐఐటీ బొంబాయి చేసిన ఓ అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనం తెలిపింది. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గతవారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు.
కరోనా వచ్చిన వారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలో సంచలన నిజాలు!
Covid Impact On Male Fertility: కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తి ప్రోటీన్లు దెబ్బతింటాయని పరిశోధకులు వెల్లడించారు.
కొవిడ్‌కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే, వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు పేర్కొన్నారు. 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్య నమూనాలను విశ్లేషించినట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చగా.. కరోనా సోకిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. అయితే, వీటిని నిర్థరించడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!