తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రికిట్​ బ్యాటే ఆశాకిరణం- లాక్​డౌన్​లో లాభాల బాట!

దేశవ్యాప్తంగా ఎన్నో మైదానాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్​ల్లో వెస్ట్ చంపారన్ డబ్ల్యూసీ బ్రాండ్​ బ్యాట్లు కనిపిస్తాయి. ఆ బ్యాట్ల రూపకర్త పశ్చిమ చంపారన్​ ప్రాంతానికి చెందిన లాలాబాబు. కరోనా కారణంగా గతేడాది లాక్​డౌన్​ విధించిన సమయంలో ఇక తమ జీవితాలు ముగిసినట్లే అనుకున్న లాలాబాబుకు.. క్రికెట్​ బ్యాటే ఆశాకిరణంలా కనిపించింది. గతంలో వేరే రాష్ట్రంలోని బ్యాట్ల తయారీ పరిశ్రమలో పనిచేసిన అతడు.. ఇప్పుడు సొంతూళ్లో కొత్త బ్రాండ్​తో బ్యాట్లు రూపొందించడమే కాదు.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండటం విశేషం.

making cricket batS
క్రికిట్​ బ్యాటే ఆశాకిరణం

By

Published : Apr 27, 2021, 11:37 AM IST

క్రికెట్​ బ్యాట్​ తయారీలో నిమగ్నం

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గతేడాది దేశంలో లాక్​డౌన్​ విధించినప్పుడు.. ఇక తమ జీవితాలు ముగిసినట్టే అనుకున్నాడో వ్యక్తి. చేసేదేం లేక బతుకుదెరువు కోసం.. వలస వెళ్లిన అనంతనాగ్ నుంచి సొంతూరు వెస్ట్ చంపారన్​కు తిరిగి వెళ్లాడు. పొట్ట నింపుకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ దైన్యంలో ఆ వ్యక్తి జీవితంలో ఆశాకిరణంలా కనిపించింది క్రికెట్ బ్యాట్.

''మా వీడియోను ఓసారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాం. అది వైరల్ అయింది. డీఎం కుందన్ కుమార్ దృష్టికి వెళ్లింది. నన్ను పిలిచారాయన. నాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇల్లు, కొంచెం భూమి ఇప్పించారు. లోన్ ఇప్పించారు. మా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నా క్రికెట్ బ్యాట్​కు మరింత ఆదరణ దక్కాలి.''

- లాలా​బాబు

దేశవ్యాప్తంగా ఎన్నో మైదానాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్​ల్లో వెస్ట్ చంపారన్ డబ్ల్యూసీ బ్రాండ్​ బ్యాట్లు కనిపిస్తాయి. ఆ బ్యాట్ల రూపకర్త పశ్చిమ చంపారన్​ ప్రాంతానికి చెందిన లాలాబాబు. ఒకప్పుడు అనంతనాగ్​లో బ్యాట్ల తయారీ పరిశ్రమలో పనిచేసే అతడు.. సొంతూరిలో కొత్త బ్రాండ్​తో బ్యాట్లు రూపొందించడమే కాదు.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

''మొదట్లో వాళ్లంతా టెక్స్​టైల్​ దుకాణాల్లో పనిచేసేవారు. దాంతోపాటు ఇతర రంగాల్లో పనిచేసే వారికి కూడా స్వయం ఉపాధి లభించింది. కొంతమంది అనంతనాగ్​లో బ్యాట్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వాళ్లు సొంతంగా వెస్ట్ చంపారన్ అనే బ్రాండ్​తో బ్యాట్లు రూపొందిస్తున్నారు.''

- కుందన్ కుమార్, జిల్లా అధికారి

మేరఠ్​ నుంచి కలప..

ప్రస్తుతం లాలాబాబు వద్ద పనిచేస్తున్న కార్మికులంతా ఒకప్పుడు అనంతనాగ్​లో ఇదే పని చేసినవాళ్లే. అందుకే అత్యుత్తమ కలపతో బ్యాట్లు తయారు చేసే కళపై మంచి పట్టు సాధించారు. డబ్ల్యూసీ బ్యాట్ల తయారీ కోసం కశ్మీర్, మేరఠ్ నుంచి కలప తెప్పిస్తారు.

''మేం కశ్మీరీ కలప నుంచి బ్యాట్లు తయారుచేస్తాం. అక్కడి నుంచి కలప తెప్పిస్తాం. దీని ప్రత్యేకత ఏంటంటే పెలుసుగా ఉండదు. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.''

- లాలాబాబు

ఒక చెట్టు నుంచి 100 నుంచి 200 బ్యాట్లు తయారవుతాయి. ఈ చెట్లు పెరగడానికి మాత్రం 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. వాటిని నరికేసిన తర్వాత, పూర్తిగా ఎండబెట్టడానికే ఏడాదిన్నర సమయం కేటాయిస్తారు.

''ఇప్పటివరకూ దాదాపు 1600 బ్యాట్లు విక్రయించాం. ప్రస్తుతం నాదగ్గర 4 వేల బ్యాట్ల ఆర్డర్ ఒకటి ఉంది. దాన్నే పూర్తిచేసే పనిలో ఉన్నాం.''

- లాలాబాబు

మేరఠ్​ నుంచి ప్రత్యేక కలపను తెప్పిస్తున్నాడు లాలాబాబు. హ్యాండిల్, గ్రిప్, స్టిక్కర్ల తయారీలోనూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

''మాకు ఇక్కడే పుష్కలంగా పని దొరుకుతున్నందున బయటికి వెళ్లాల్సి రావడం లేదు. ఇక బయటికే వెళ్లడం లేదు. ఇక్కడే చక్కగా పని చేసుకుంటాం.''

- శశాంక్ కుమార్ యాదవ్

''నేనైతే ఇక్కడ చాలా మంచి పని చేసుకుంటున్నా. నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా. భగవంతుడి కృపతో మాకిక్కడ ఉపాధి లభించింది. ఇంట్లోనే కూర్చుని సంపాదించుకోవచ్చు. ఇక బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలాగే ఎప్పటికీ ఉపాధి దొరకాలని భగవంతుడిని వేడుకుంటున్నా.''

- అజయ్ కుమార్

తిరిగి కశ్మీర్​కు వెళ్తారా అని లాలాబాబుని అడిగితే.. ఇంకెప్పుడూ ఊరు విడిచి వెళ్లాల్సిన అవసరం తనకు రాదని ధీమాగా చెబుతున్నాడు.

ఇవీ చూడండి:తొమ్మిదేళ్ల వయసులోనే 'చిత్రలేఖనం'లో అద్భుతాలు

గుండెల్ని పిండేస్తున్న 'ప్రాణవాయువు'​ కొరత

ABOUT THE AUTHOR

...view details