'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అని చూడగానే నచ్చేశావ్ అంటూ ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది యువతి. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అంతలోనే ఓ మిస్డ్ కాల్లో మరొకరు కలిశారు. అతడిని ప్రేమించింది. భర్త, కుమారుడిని వదిలేసి అతడితో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మరొకరిని కలిసింది. రెండో భర్తనూ వదిలేసి మూడో భర్త చెంతకు చేరింది. ఆ యువతి కథ తెలుసుకోవాలంటే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చూడండి!
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వతోడా ప్రాంతంలో తన బంధువులతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తిని తొలి చూపులోనే ఇష్టపడి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు యువతికి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ కాల్‌తో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన పవన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. ఆ యువతి కోసం ఔరంగాబాద్ వదిలి నాగ్‌పుర్ చేరుకున్నాడు ఆ యువకుడు. తనకు పెళ్లి జరిగిన విషయం యువతి చెప్పకపోవడం వల్ల.. పవన్ తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. దీనికి ఒప్పకున్న యువతి గుడిలో పవన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత మొదటి భర్తను వదిలిపెట్టి సోనేగావ్ ప్రాంతానికి మకాం మార్చింది. దీంతో మొదటి భర్త మద్యానికి బానిసైపోయాడు.