ప్రపంచంలో అతి పెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్ వ్యూహాత్మక పాత్రను గుర్తిస్తున్నట్లు ఐరోపా కూటమి ప్రకటించింది. ఐరోపా కూటమి, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి తొలి అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. భారత్‌తో వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై పూర్తిస్థాయిలో ఏ దాపరికాలు లేకుండా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈయూ తెలిపింది.
సార్వత్రిక, సమ దృష్టితో పాటు అందుబాటు ధరలో సురక్షిత టీకాను అందించడమే భారత్-ఈయూ ప్రాధాన్య అంశమని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. వర్చువల్గా జరిగే ఈ చర్చలకు భారత్ ఆతిథ్యమిస్తోంది.