తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెల్​ టవర్​ ఎక్కి టీచర్ ఆందోళన​.. ఎందుకంటే? - ett teacher

ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఓ టీచర్​(ett teacher punjab) మొబైల్​ టవర్​ ఎక్కి నిరసన తెలిపారు(teachers climb mobile tower). కొన్ని గంటల పాటు శ్రమించి కిందకు తీసుకొచ్చారు పోలీసులు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు ఆ టీచర్​. ఇంతకి వారి డిమాండ్లేమిటి?

ETT teachers climb mobile tower
సెల్​ టవర్​ ఎక్కి టీచర్ ఆందోళన​

By

Published : Nov 27, 2021, 2:01 PM IST

Updated : Nov 27, 2021, 3:13 PM IST

సెల్​ టవర్​ ఎక్కి టీచర్ ఆందోళన

మొబైల్​ టవర్​ ఎక్కి ఆందోళన చేశారు ఓ టీచర్(ett teacher punjab)​. కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే తనను తాను కాల్చుకుంటానని బెదిరించారు(teachers climb mobile tower). చండీగఢ్​లో జరిగిన ఈ సంఘటనకు గల కారణాలేంటి?

పంజాబ్​ రాజధాని చండీగఢ్​లోని(Punjab news) ఎమ్మెల్యే హాస్టల్​ సెక్టార్​ 4లో ఓ ఒకేషనల్​ ఉపాధ్యాయుడు మొబైల్​ టవర్​ ఎక్కి ఆందోళన చేశారు. శనివారం తెల్లవారుజామునే టవర్​ ఎక్కిన ఆ టీచర్​ను కిందకు తీసుకొచ్చేందుకు కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. చండీగఢ్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ ఉపాధ్యాయుడిని కిందకు తీసుకొచ్చారు. అయితే, తన డిమాండ్లను పరిష్కరించకపోతే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.

కారణమిది..

2016లో 180 మంది అధ్యాపకులను ఒప్పంద ప్రాతిపదికన ఒకేషనల్​ కోర్సుల్లో నియామకం చేసింది పంజాబ్​ ప్రభుత్వం. రెండేళ్ల తర్వాత ఆకస్మాత్తుగా వారిని తొలిగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఆదేశాలు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఉపాధ్యాయ యూనియన్లు ఆందోళనబాట పట్టాయి. తమను విధుల్లోకి తీసుకుని రెగ్యులర్​ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సీఎంతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఈ కారణంగానే మొబైల్​ టవర్​ ఎక్కి ఆందోళన చెపట్టారు టీచర్​.

ఇదీ చూడండి:ఖాళీ భవనంలో యువతి మృతదేహం- హత్యాచారమా?

Last Updated : Nov 27, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details