Etela Rajender Meet Ponguleti and Jupally : హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫార్మ్ హౌస్లో ప్రముఖ రాజకీయ నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నారు. వారి మధ్య నాలుగు గంటలుగా సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నాయకుల గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను ఈటల రాజేందర్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దిల్లీలో చోటు చేసుకున్న చర్చల సారాంశం గురించి నేతలు చర్చిస్తున్నారు.
Etela Rajender Meet Ponguleti and Jupally : బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లికి ఈటల ఆహ్వానం - హైదరాబాద్ వార్తలు
15:26 May 25
Etela Rajender Meet Ponguleti and Jupally : బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లికి ఈటల ఆహ్వానం
కొద్దిరోజులుగా పార్టీ బలోపేతంతో పాటు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ సమయంలోనే వీరితో భేటీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే వారితో ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ ముఖ్యనేతలు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుతోనూ సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్న నేపథ్యంలోనే చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూప్లలి కృష్ణారావులను బీఆర్ఎస్ తమ పార్టీ లోంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు పొంగులేటితో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పొంగులేటిని బీజేపీలోకి తీసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. గతంలో రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలతో చర్చించడంతో పాటు నేరుగా పొంగులేటితో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకుగానూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ దిల్లీకి కూడా వెళ్లారు.
పొంగులేటి, జూపల్లి సమాలోచనలు: మరోవైరు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అడుగు కావడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇద్దరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నాయకులు, అనుచరులతో సమావేశమవుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనే పార్టీతో పాటు రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: