primary school teacher assets: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి జీతం గరిష్ఠంగా రూ.50వేల వరకు ఉండొచ్చు. అదీ రిటైర్మెంట్కు సమీపంలో ఉన్నవారికి ఆ మాత్రం వస్తుందేమో. మరికొందరు చిన్నాచితకా వ్యాపారాలు చేస్తూ అదనంగా సంపాదిస్తుంటారు. అయితే, లక్షల రూపాయలు తెచ్చిపెట్టే వ్యాపారాలు చేస్తూ ఉపాధ్యాయుడిగా కొనసాగటం చూశారా? ఓ ఉపాధ్యాయుడు 20 కళాశాలలకు యజమాని అంటే నమ్ముతారా? అవునండీ అది నిజమే. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) అధికారులు ఘతిగావ్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రశాంత్ పర్మార్ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో శనివారం దాడులు చేశారు. ఆయనకు లెక్కకు మించిన ఆస్తులు ఉండటం, 20 కళాశాలలకు యజమానిగా గుర్తించి ఆశ్చర్యపోయారు.