ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామమందిరంలో ప్రతి వస్తువును చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిలో భాగంగా ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు భారీ వ్యయంతో ప్రవేశ ద్వారాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలోకి ప్రవేశించే భక్తులకు మంచి అనుభూతి కలిగేలా ఈ ద్వారాలను నిర్మించనుంది. ఈ మేరకు 65 కోట్ల రూపాయల నిధులను తొలివిడతగా విడుదల చేసింది. ప్రవేశ ద్వారాల నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. బ్యాంక్ డీడీ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ప్రవేశ ద్వారాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. రూ.65 కోట్లతో ప్రవేశ ద్వారాలు.. ఆలయ గోడలపై.. - అయోధ్య లేటెస్ట్ న్యూస్
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయోధ్యలోకి ప్రవేశించే భక్తులు మంచి అనుభూతిని పొందేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలను నిర్మించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాటితో పాటు రామాయణంలోని సన్నివేశాలను ఆలయ గోడలపై చెక్కేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
Entrance gates will be constructed at a cost of 65 crores in Ayodhya
అయోధ్యను చూసేందుకు వచ్చే టూరిస్టులు ఆ ద్వారాలలోకి ప్రవేశించగానే.. త్రేతాయుగంలో రామనగరి చూసిన అనుభూతి పొందేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. న భూతో.. న భవిష్యత్ అనే విధంగా ఆలయ నిర్మాణాన్ని చేపడుతోంది. వరల్డ్ టూరిజం మ్యాప్‌లో అయోధ్య కంటూ ఓ గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రామాయణంలోని సన్నివేశాలను ఆలయ గోడలపై చెక్కేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.