తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసెంబ్లీని ముట్టడించిన 3 లక్షల మంది డ్రైవర్లు - భువనేశ్వర్

ఒడిశా అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు డ్రైవర్లు. దాదాపు 3లక్షల మంది డ్రైవర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని భువనేశ్వర్​లో రోడ్డెక్కారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Bhubaneswar
drivers protest

By

Published : Apr 18, 2022, 10:17 AM IST

Updated : Apr 18, 2022, 11:16 AM IST

ఒడిశా అసెంబ్లీని ముట్టడించిన డ్రైవర్లు

భువనేశ్వర్​లోని ఒడిశా అసెంబ్లీని చుట్టుముట్టారు డ్రైవర్లు. 30 జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది రాజధానికి చేరుకొని తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగనప్పటికీ.. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసున్నట్లు తెలుస్తోంది.

డ్రైవర్ల నిరసన

ఒడిశా డ్రైవర్స్ ఫెడరేషన్​ 11 పాయింట్ల డిమాండ్​తో ఈ ఆందోళన చేపట్టింది. వాటిల్లో 55ఏళ్ల పైబడినవారికి పెన్షన్, 30 కిలోమీటర్లకు ఓ టాయిలెట్, రోడ్డు భద్రత, డ్రైవర్లు చనిపోతే రూ.2 లక్షల బీమా, ప్రమాదంలో చనిపోతే రూ.5లక్షలు, వారి పిల్లలకు ఉచిత విద్య, ఇందిరా ఆవాస్ యోజన వంటివాటిని తమకు కల్పించాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీని ముట్టడించిన డ్రైవర్లు

సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి డ్రైవర్లు పాదయాత్రగా వెళ్లేందుకు యత్నించడం వల్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్ , నవీన్ నివాస్ మార్గాల్లో పటిష్ఠ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'

Last Updated : Apr 18, 2022, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details