తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విహారయాత్రలో విషాదం... ముగ్గురు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి.. - కర్ణాటక న్యూస్​

Kerala Engineering Students Death: కేరళ కొట్టాయంకు చెందిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. కర్ణాటకలోని ఉడిపిలోని సెయింట్​ మేరీస్ ఐలాండ్​లో ఈ ప్రమాదం జరిగింది.

By

Published : Apr 7, 2022, 10:00 PM IST

Kerala Engineering Students Death: కర్ణాటక ఉడిపి జిల్లాలో విషాదం నెలకొంది. గురువారం సెయింట్ మేరీస్ ఐలాండ్​లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని కేరళ కొట్టాయంలోని మంగళ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన.. అలెన్​ రెజీ, అమల్​ అనిల్​, ఆంటోని షేనోయ్​గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. 42 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్స్​తో కూడిన బృందం విహారయాత్రకి వెళ్లారు. అందులో కొందరు విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. అలల తాకిడికి కొట్టుకుపోయారు. వీరిలో అమల్​ అనిల్​, అలెన్ రెజీ మృతదేహాలు లభ్యంకాగా.. ఆంటోని షేనోయ్​ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను ఉడిపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విహార యాత్రలో విషాదం

ABOUT THE AUTHOR

...view details